Land Allocation: విశాఖలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:15 AM
దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో తన కార్యకలాపాలను విస్తరించడా నికి భూమి కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
20 ఎకరాలు కావాలంటూ దరఖాస్తు
ఎండాడ, పరదేశిపాలెంలో స్థలాల పరిశీలన
విశాఖపట్నం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో తన కార్యకలాపాలను విస్తరించడా నికి భూమి కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏపీఐఐసీ అధికారులతో కలిసి పరదేశిపాలెం, ఎండాడ ప్రాంతాల్లో అందుబాటు లో ఉన్న భూములను పరిశీలించింది. హైవేను ఆనుకొని ఎండాడలో దిశ పోలీస్ స్టేషన్ ఉన్న కొండపై 20 ఎకరాలు కేటాయించాలని, శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేపడతామని దరఖాస్తు చేసింది. టీసీఎస్‌కు, కాగ్నిజెంట్ కంపెనీలకు ఎకరా 99 పైసలు చొప్పున ఇచ్చినట్లుగానే తమకూ భూములు కేటాయిస్తే భారీ సంఖ్యలో ఉద్యో గావకాశాలు కల్పిస్తామని ప్రతిపాదించింది. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. టీసీఎస్‌కు రుషికొండ హిల్-3పై 21.6 ఎకరా లు, కాగ్నిజెంట్‌కు కాపులుప్పాడలో 21.33ఎకరా లు ఎకరా 99 పైసలు చొప్పున కేటాయించిన సంగతితెలిసిందే. టీసీఎస్ 12వేల మందికి, కాగ్నిజెంట్ 25వేలమందికి ఉద్యోగ అవకాశా లు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నాయి.