అచ్యుతాపురం సెజ్ రైతులకు పరిహారం చెల్లిస్తాం: టీజీ భరత్
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:41 AM
రాష్ట్రంలో సెజ్‌లకు భూములిచ్చిన రైతులకు నష్టం లేకుండా చూస్తామని పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో సెజ్‌లకు భూములిచ్చిన రైతులకు నష్టం లేకుండా చూస్తామని పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సుందరపు విజయ్‌కుమార్, యనమల దివ్య, గంటా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. అచ్యుతాపురం సెజ్‌లో 195 మంది రైతులకు మాత్రమే పెండింగ్ ఉందని, వీరికి రూ.2.75 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. నష్టపరిహారం వ్యత్యాసం విషయంలో సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు.