Share News

రూ.2.10 కోట్లతో కొత్తచెరువులో ఇండోర్‌ స్టేడియం

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:46 AM

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో రూ.2.10కోట్లతో ఇండ్రోర్‌ స్టేడియం నిర్మిస్తున్నట్లు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణం పూర్తయితే కొత్తచెరువుకు తలమానికంగా ఉంటుందన్నారు.

రూ.2.10 కోట్లతో కొత్తచెరువులో ఇండోర్‌ స్టేడియం

  • ఆంధ్రజ్యోతి ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ ఫలితం

  • పనులకు శ్రీకారం చుట్టిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

కొత్తచెరువు, జనవరి 31(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో రూ.2.10కోట్లతో ఇండ్రోర్‌ స్టేడియం నిర్మిస్తున్నట్లు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణం పూర్తయితే కొత్తచెరువుకు తలమానికంగా ఉంటుందన్నారు. కొత్తచెరువు మండల కేంద్రంలోని సత్యసాయిబాబా జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2018లో నాటి సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అన్నారు. కొత్తచెరువులో రూ.కోటి నిధులతో నిర్మాణపనులకు శ్రీకారం చుట్టారని, వైసీపీ అధికారంలోకి రావడం, సైకో ముఖ్యమంత్రి జగన్‌ కారణంగా పనులు నిలిచిపోయాయని విమర్శించారు. గత ఏడాది ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో ఈ సమస్య గురించి ప్రజలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. ఆ తరువాత కొత్తచెరువులో జరిగిన మెగా పీటీఎంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తాము తీసుకెళ్లామని, వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తామని చెప్పారని తెలిపారు. నిర్మాణ పనులకు రూ.2.10 కోట్లతో ప్రతిపాదనలు అందించగా మంజూరు చేశారని తెలిపారు. వీటితో ఇండోర్‌ స్టేడియం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 04:48 AM