ఆగస్టు 14 నుంచి విశాఖ నుంచి అబుదాబికి విమానం
ABN , Publish Date - Jun 28 , 2026 | 06:03 AM
విశాఖపట్నం నుంచి అబుదాబీకి మళ్లీ విమాన సర్వీస్ నడపడానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ ముందుకువచ్చింది.
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నుంచి అబుదాబీకి మళ్లీ విమాన సర్వీస్ నడపడానికి ఇండిగో ఎయిర్‌లైన్స్ ముందుకువచ్చింది. గతంలో ఈ సర్వీసు అందుబాటులో ఉండేది. పశ్చిమ ఆసియా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ అంతా అనుకూలంగా ఉండడంతో సర్వీసును పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఆగస్టు 14 నుంచి అందుబాటులోకి వస్తుంది. వారానికి నాలుగు రోజులు అంటే సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో విమానం నడుస్తుంది.