Share News

‘నియర్‌ స్పేస్‌’లోకి సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌

ABN , Publish Date - May 13 , 2026 | 04:45 AM

సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌’... ఇప్పటి వరకు అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి దేశాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ భారత్‌కూ పరిచయం కానుంది.

‘నియర్‌ స్పేస్‌’లోకి సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌

  • శాటలైట్‌గా సేవలు.. నేడు విజయవాడలో ట్రయల్‌

విజయవాడ, మే 12 (ఆంధ్రజ్యోతి): ‘సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌’... ఇప్పటి వరకు అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌ వంటి దేశాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ భారత్‌కూ పరిచయం కానుంది. విజయవాడకు చెందిన రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌ అనే స్టార్టప్‌ రూపొందించిన ఈ సూపర్‌ ప్రెజర్‌ బెలూన్‌ దేశంలోనే తొలిసారిగా గాల్లోకి ఎగరనుంది. బుధవారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ బెలూన్‌ పనితీరుని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌, టెలికాం సేవలందించే లక్ష్యంతో చేసిన ఈ బెలూన్లు 25 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరి ‘నియర్‌ స్పేస్‌’ ప్రాంతంలో పనిచేస్తాయి.

Updated Date - May 13 , 2026 | 04:45 AM