రైల్వేస్ అట్లా్‌సలో హైదరాబాద్-చెన్నై కారిడార్
ABN , Publish Date - May 13 , 2026 | 05:14 AM
ఇండియన్ రైల్వేస్ అట్లా్‌స(మ్యా్‌ప)లో తాజాగా హైదరాబాద్-చెన్నై వయా అమరావతి హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్‌మెంట్‌ని పొందుపరిచింది.
అమరావతి మీదుగా అలైన్‌మెంట్.. దాచేపల్లి మీదుగా రూట్
గుంటూరు, మే 12(ఆంధ్రజ్యోతి): ఇండియన్ రైల్వేస్ అట్లా్‌స(మ్యా్‌ప)లో తాజాగా హైదరాబాద్-చెన్నై వయా అమరావతి హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్‌మెంట్‌ని పొందుపరిచింది. ఇప్పటివరకు ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ సూర్యాపేట, కోదాడ మీదుగా ఉంటుందని భావించారు. అయితే హైదరాబాద్ సమీపంలోని భారత్ సిటీ-డ్రైపోర్టు-వాడపల్లి-దాచేపల్లి-అమరావతి మీదుగా రైల్వే శాఖ అలైన్‌మెంట్ చేసింది. ఇందులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు, అమరావతిలో నిర్మించే విమానాశ్రయం, తిరుపతి ఎయిర్‌పోర్టులను అనుసంధానించింది. అప్‌డేట్ చేసిన అట్లా్‌సను ఈనెల ఒకటిన ఇండియన్ రైల్వేస్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇందులో హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌ను బ్లూ లైన్‌గా మార్క్ చేసింది. అట్లాస్ ప్రకారం హైస్పీడ్ రైల్ కారిడార్ హైదరాబాద్ నుంచి ప్రారంభమై శంషాబాద్ ఎయిర్‌పోరు, భారత్ సిటీ, డ్రైపోర్టు, హాలియా, దాచేపల్లి, వడ్డమాను-అమరావతి పుణ్యక్షేత్రం మధ్య నుంచి అమరావతి రాజధానికి, అక్కడి నుంచి మంగళగిరి-నంబూరు మధ్య నుంచి గుంటూరు-వేజండ్ల, నెల్లూరు, గూడూరు, తిరుపతి ఎయిర్‌పోర్టు, చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. ఈ అలైన్‌మెంట్‌లోనే అమరావతిలో నూతనంగా నిర్మించబోయే విమానాశ్రయం ఉంటుంది.