రూ.1,364 కోట్లతో కవచ్, ఆధునిక సిగ్నలింగ్
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:59 AM
రైల్వే భద్రతకు ఉద్దేశించిన ‘కవచ్’, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ కోసం రూ.1,364.45 కోట్లు కేటాయిస్తున్నట్టు సోమవారం రైల్వే శాఖ తెలిపింది. రైళ్లు ఢీకొట్టకుండా నివారించేందుకు..
గుంతకల్, నాందేడ్ డివిజన్లకు లబ్ధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రైల్వే భద్రతకు ఉద్దేశించిన ‘కవచ్’, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ కోసం రూ.1,364.45 కోట్లు కేటాయిస్తున్నట్టు సోమవారం రైల్వే శాఖ తెలిపింది. రైళ్లు ఢీకొట్టకుండా నివారించేందుకు ఇంజిన్లకు కవచ్ పరికరాలను అమర్చనుంది. దక్షిణ రైల్వేలో రూ.208.81 కోట్లతో 232 ఇంజిన్లకు ఈ సౌకర్యం కలిగించనుంది. ఉత్తర రైల్వేలో కవచ్ వెర్షన్ 4.0ను అమలు చేయనుంది. దక్షిణమధ్య రైల్వేలోని గుంతకల్, నాందేడ్ డివిజన్లలో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరించనుంది. ప్రస్తుతం ఉన్న ప్యానల్ ఇంటర్‌లాకింగ్ సిస్టం బదులు ఎలకా్ట్రనిక్ ఇంటర్‌లాకింగ్ విధానాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 49 స్టేషన్లకు దీని ద్వారా లబ్ధి కలగనుంది.