అమరావతిలో ఇండియన్ బ్యాంక్ రాష్ట్ర కార్యాలయం
ABN , Publish Date - May 19 , 2026 | 05:35 AM
అమరావతి ప్రాం తంలోని ఉద్దండరాయునిపాలెంలో ఇండియన్ బ్యాంక్ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు.
42.65 కోట్ల వ్యయంతో రెండేళ్లలో పూర్తి
ఎన్‌బీసీసీతో జోనల్ అధికారుల ఎంవోయూ
గుంటూరు(తూర్పు), మే 18 (ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రాం తంలోని ఉద్దండరాయునిపాలెంలో ఇండియన్ బ్యాంక్ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. సోమవారం గుంటూరులోని ఇండియన్ బ్యాం క్ జోనల్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణ రంగ సంస్థ(ఎన్‌బీసీసీ)తో అధికారులు భవన నిర్మాణానికి ఒప్పంద పత్రాలను(ఎంవోయూ) మార్చుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ జోనల్ హెడ్ గౌరీ శంకరరావు మాట్లాడుతూ.. ఇండియన్ బ్యాంక్ రాష్ట్ర కేంద్ర కార్యాలయం 40 సెంట్ల స్థలంలో రూ. 42.65 కోట్ల వ్యయంతో నిర్మితమవుతోందని తెలిపారు. దీని నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ అధికారులు, ఎన్‌బీసీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.