30లలోనే మధుమేహం
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:27 AM
యుక్త వయసులో ఉన్నాం.. ఆరోగ్యంగానే ఉంటాంలే అని భరోసాగా ఉండే కుర్రకారుకు నిజంగా ఇది షాకింగ్ న్యూసే! ఎందుకంటే, 30 ఏళ్ల లోపు యువతలోనే ప్రీ డయాబెటిక్ కేసులు అధికంగా బయటపడుతున్నాయ....
ప్రతీ ఐదుగురిలో ఒకరు ప్రీ డయాబెటిక్... 69 శాతం మందిలో విటమిన్ డీ లోపం
విద్యార్థి దశలోనే అనారోగ్య సమస్యలు
46 శాతం మందిలో ప్రీ హైపర్ టెన్షన్
అపోలో హాస్పిటల్స్ ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026’ నివేదికలో వెల్లడి
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): యుక్త వయసులో ఉన్నాం.. ఆరోగ్యంగానే ఉంటాంలే అని భరోసాగా ఉండే కుర్రకారుకు నిజంగా ఇది షాకింగ్ న్యూసే! ఎందుకంటే, 30 ఏళ్ల లోపు యువతలోనే ప్రీ డయాబెటిక్ కేసులు అధికంగా బయటపడుతున్నాయని అపోలో హాస్పిటల్స్ వార్షిక నివేదిక వెల్లడించింది. ప్రతీ ఐదుగురిలో ఒకరు ప్రీ డయాబెటిక్ అని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని ‘హెల్త్ ఆఫ్ ది నేషన్-2026’ పేరుతో ఈ నివేదికను అపోలో విడుదల చేసింది. గత సంవత్సరం దేశంలోని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందిపై జరిపిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా నివేదికను రూపొందించారు. దీంట్లో యువత ముఖ్యంగా, 30 ఏళ్లలోపు వారిలో తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలను విస్తారంగా చర్చించారు. మూడింట రెండొంతల మందికి శారీర దారుఢ్యం ఉండటం లేదని, బలహీనంగా ఉంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. వీరిలో శారీరక శ్రమ లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలను వెంట పెట్టుకుని వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు, ఈ వయసు వారిలో 69ు మందిలో విటమిన్ డీ లోపం ఉందని, 59 శాతం మంది ఊబకాయులేనని, 52ు మందిలో అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు కనబడుతున్నాయని తెలిపింది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు సంక్రమణేతర వ్యాధుల ప్రమాదాన్ని కలిగి ఉన్నారని, ఈ వయసు ఉద్యోగులలో దాదాపు సగం మంది ప్రీ డయాబెటిక్ లేదంటే డయాబెటిక్‌గా ఉన్నారని పేర్కొంది. విద్యార్థుల పరంగా చూస్తే ప్రతి 10 మంది విద్యార్థులలో నలుగురు ఊబకాయులుగా ఉండటం గమనార్హం. 46 శాతం మంది ప్రీ హైపర్ టెన్షన్ బాధితులు, 45 శాతం మందిలో విటమిన్ బీ 12 ఉండాల్సిన స్థాయిలో లేదు. మూడోవంతు మంది విద్యార్థినిలలో రక్తహీనత కనిపిస్తుందని అపోలో నివేదిక తెలియజేసింది.
మొత్తమ్మీద 30 ఏళ్ల లోపు వయసు వారిలో నలుగురిలో ఒకరు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేసింది. నివేదిక విడుదల సందర్భంగా అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ.. అసలైన ఆరోగ్యమనేది వ్యక్తిగతమైనది, ముందుచూపుతో కూడుకున్నదన్నారు. సరైన సమయంలో, సరైన పరీక్షల ద్వారా గుండెవ్యాధులతో పాటుగా క్యాన్సర్‌లను కూడా తొలిదశలోనే గుర్తించడం సాధ్యమవుతుందని అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో వ్యాధులను జనాభా, ప్రాంతాల వారీగా వర్గీకరించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. అపోలో నివేదికలో ఉన్న వివరాల్లో ముఖ్యమైనవి..
కార్పొరేట్ ఉద్యోగులు: సగటున 38 ఏళ్ల వయసున్న దా దాపు ఐదు లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగుల కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, ప్రతి పదిమందిలో ఎనిమిది మంది అధిక బరువుతో ఉన్నారని తెలిసింది.
మహిళలు: 20లలో ఉన్న మహిళల్లో విటమిన్ బీ 12 లోపం అధికంగా కనబడుతోంది. సంతానోత్పత్తికి, నరాల సంబంధిత ఆరోగ్యానికీ ఇది అత్యంత కీలకమైన విటమిన్.
ప్రాంతాలవారీగా: మధురైలో 36ుమంది మధు మేహం బారినపడే అవకాశాలుంటే, ముంబైలో 16 శాతం లోనే ఇది కనిపిస్తుంది. అలాగే రక్తహీనత సమస్య తూర్పు, ఈశాన్య భారతాలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో రెండురెట్లు తక్కువగా ఉంది.