Share News

విశ్వ గురువుగా భారత..!

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:15 AM

భారత విశ్వ గురువుగా అవతరించడానికి ఎంతో సమయం పట్టడదని, ఆ దిశగా భారతీయులంతా ఒక్కతాటిపై సమష్టిగా ముందుకు సాగాలని రాషీ్ట్రయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) అఖిల భారత సహధర్మ జాగరణ ప్రముఖ్‌ ఏలే శ్యామ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

   విశ్వ గురువుగా భారత..!
మాట్లాడుతున్న ఆర్‌ఎ్‌సఎస్‌ ఆఖిల భారత సహధర్మ జాగరణ ప్రముఖ్‌ ఏలే శ్యామ్‌కుమార్‌

సాకారం కోసం మనమంతా సముష్టిగా ముందుకు

పిల్లల్లో కుటుంబ విలువలు పెంచాలి

ఆర్‌ఎ్‌సఎస్‌ అఖిల భారత సహధర్మ జాగరణ ప్రముఖ్‌ ఏలే శ్యామ్‌కుమార్‌

ఘనంగా ఆర్‌ఎ్‌సఎస్‌ ‘వందేళ్ల వైభవ భారతం’

కర్నూలు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): భారత విశ్వ గురువుగా అవతరించడానికి ఎంతో సమయం పట్టడదని, ఆ దిశగా భారతీయులంతా ఒక్కతాటిపై సమష్టిగా ముందుకు సాగాలని రాషీ్ట్రయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) అఖిల భారత సహధర్మ జాగరణ ప్రముఖ్‌ ఏలే శ్యామ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆర్‌ఎ్‌సఎస్‌ ఆవిర్భవించి వందేళ్లు అయిన సందర్భంగా మంగళవారం నగరంలోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల కాన్ఫరెన్స హాల్‌లో ‘ఆర్‌ఎ్‌సఎస్‌ వందేళ్ల వైభవ భారతం’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ రంగాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏలే శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ మహారాష్ట్రలో నాగపూర్‌లో స్వాతంత్య్ర సమరయోదుడు డాక్టర్‌ కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ 1925లో ఆర్‌ఎ్‌సఎ్‌సను స్థాపించారని గుర్తు చేశారు. హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం, క్రమశిక్షణను, దేశభక్తిని, పెంపొందించడం, జాతీయవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం ప్రధాన ఆశయంగా ఆర్‌ఎ్‌సఎ్‌సను స్థాపించారు. ఈ సంస్థ ఎదుగుదలలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొందని వివరించారు. సామాజిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, కుటుంబం, స్వదేశి ఆచరణ, పౌరుల బాధ్యత.. ఐదు సూత్రాలతో ఆర్‌ఎ్‌సఎస్‌ ముందుకు సాగుతుందన్నారు. ఈ రోజుకి గ్రామాల్లో ఆలయాల్లో కొందరికి ప్రవేశాలు లేకపోవడం దురదుష్టకరమన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించారని గుర్తు చేశారు. ఇలాంటి వివక్షతకు మన సంస్కృతిలో స్థానంలో లేదన్నారు. సామాజిక సమానత్వం అలవర్చుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ వినియోగానికి స్వస్తి చెప్పాలన్నారు. నాలుగు శాతం లేని అమెరికా 40 శాతం ప్రకృతిని నాశనం చేస్తోందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు భూగర్భ జల సంరక్షణ, మొక్కలు నాటడం, వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, సెల్‌ఫోన్ల మాయలో కుటుంబ విలువలు మాయమవుతున్నారు. ఆత్మీయ అనురాగాలు దూరం అవుతున్నాయని, మన పిల్లల్లో కుటుంబ విలువలు, భారత సంస్కృతిని పెంచాలని సూచించారు. స్వదేశీ వస్తువులనే కాదు, స్వదేశీ సంప్రదాయలు పాటించాలని, రాజ్యాంగ విలువలు పాటించడం పౌరుల బాధ్యతగా గుర్తుంచుకోవాలని అన్నారు. మనమంతా ఓటు వేయకపోతే దుర్మార్గులు రాజ్యాధికారంలోకి వస్తారని, అందరు జాగ్రతగా ఉండాలని గుర్తు చేశారు. రాజ్యాంగం చెప్పిన సూత్రాలు, నియమాలతో పాటు సంస్కృతి నేర్పించిన నియమాలు పాటించాలి. పెద్దలు, మహిళలను గౌరవించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ కర్నూలు జిల్లా సంఘచాలక్‌ ఎనవీఎ్‌స గుప్తా, సహ సంఘచాలక్‌ సూరా వెంకటరెడ్డి, పీఆర్‌ఓ పరుశరాముని రామకృష్ణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:16 AM