Share News

పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలి

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:03 AM

ఇరాన ఇజ్రాయిల్‌ యుద్ధం వల్ల పెరిగిన గ్యాస్‌ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు వెంకటేశులు, లింగన్న డిమాండ్‌ చేశారు.

పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలి
అంబేడ్కర్‌ కూడలి వద్ద ఆందోళన చేస్తున్న సీపీఎం నాయకులు

సీపీఎం నాయకుల డిమాండ్‌

ఆదోని రూరల్‌, మార్చి 9 (ఆంధ్రజ్యో తి) : ఇరాన ఇజ్రాయిల్‌ యుద్ధం వల్ల పెరిగిన గ్యాస్‌ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు వెంకటేశులు, లింగన్న డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద పెరిగిన వంట గ్యాస్‌ ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరానపై ఇజ్రాయిల్‌ అమెరికా చేస్తున్న దాడులు నివారించడానికి భా రత ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ము ఖ్యంగా పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను తగ్గించాలని లేనిపక్షంలో ప్రజాపోరాటాలకు దిగుతామని హెచ్చరించారు.

దేవనకొండ: ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరను తగ్గించాలని సీపీఎం జిల్లా నాయకుడు వీరశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం తెర్నేకల్‌ గ్రామంలోని సీపీఎం కా ర్యాలయంలో పార్టీ శాఖ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మహబూబ్‌బా ష, అశోక్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

ఆస్పరి: అమెరికా ప్రోత్సాహంతో జరుగుతున్న యుద్ధాల వల్ల భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలను తగ్గించాలని సీపీఎం మండల కార్యదర్శి బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించాలన్నారు. అలాగే యుద్ధం కారణంగా పెరిగిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పెద్ద వీరభద్ర, రవి, పెద్ద రంగన్న, వీరేష్‌, కాశన్న, రాజశేఖర్‌, రాజు, శీను, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:03 AM