Minister Satya Kumar: ఓపీ, ఐపీ సేవలపై నమ్మకం పెరిగింది
ABN , Publish Date - Jan 10 , 2026 | 06:19 AM
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీ, ఐపీ రోగుల సంఖ్య.. ప్రజారోగ్య వ్యవస్థ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అన్నారు.
వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో మంత్రి సత్యకుమార్
అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీ, ఐపీ రోగుల సంఖ్య.. ప్రజారోగ్య వ్యవస్థ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అన్నారు. అయినప్పటికీ పలు విషయాల్లో పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 17 ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్, అడ్మినిస్ట్రేటర్లతో శుక్రవారం వివిధ అంశాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. డిసెంబరులో సేకరించిన ప్రజాభిప్రాయం మేరకు జీజీహెచ్‌ల్లో లభించే వైద్యసేవల పట్ల 60-70శాతం రోగులు సంతృప్తి వ్యక్తం చేశారని.. 30-40ు ఉన్న ప్రతికూలతలను తొలగించడం సూపరింటెండెంట్ల బాధ్యత అని స్పష్టంచేశారు.