ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచండి
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:53 PM
ప్రభుత్వ పా ఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్వాసం పెంచాలని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ సూచించారు.
రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్
భాషోపాధ్యాయ సంఘం, రాష్ట్ర జాతీయ
ఉపాధ్యాయ పరిషత సంఘం క్యాలెండర్ల ఆవిష్కరణ
నంద్యాల రూరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పా ఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్వాసం పెంచాలని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ సూచించారు. శనివారం టీడీ పీ కార్యాలయంలో రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం, రాష్ట్ర జాతీ య ఉపాధ్యాయ పరిషత సంఘం (ఆర్‌జేయూపీ) నూతన సంవత్సర క్యాలెండర్లను, డైరీలను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ సమాజంలో అత్యు న్నత స్థానం గురువులదేనన్నారు. సమాజ మార్పులో ఉపాధ్యాయుల పాత్ర అమోఘం, అనిర్వచనీయమని కొనియాడారు. విద్యా ప్రమా ణాల పెంపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో భాషాపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కన్నయ్య, ఉశేన మియ్యా, రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత సంఘ నాయకులు అన్నెం శ్రీనివాసరెడ్డి, శేషపణి, వెంకటరాముడు, నీలం వెంకటేశ్వర్లు, నబీసా తదితరులు పాల్గొన్నారు.