మోహన్‌బాబు వర్సిటీలో ఆత్మహత్యపై విచారణ జరపాలి
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:01 AM
మోహన్‌బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి బాలాజీ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఐక్య విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): మోహన్‌బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి బాలాజీ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఐక్య విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి నిజానిజాలు వెల్లడి చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్, పీడీఎ్‌సయూ, ఏఐఎ్‌సఏల రాష్ట్ర కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్, బందెల నాసర్‌జీ, వినోద్, సురేశ్, కిరణ్, నాగార్జున, ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర కో-ఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. మోహన్‌బాబు యూనివర్సిటీ యాజమాన్యం గత కొంతకాలంగా విద్యార్థులు, తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఓ విద్యార్థి మరణం అనుమానాలకు తావిస్తోందని వారు పేర్కొన్నారు.