పట్టపగలే..
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:49 PM
స్థానిక ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో బుధవారం పట్టపగలే ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టారు.
ఆస్పత్రి ప్రాంగణంలో అనుమతుల్లేకుండా తవ్వకాలు
భవన నిర్మాణాలకు మట్టిని తరలిస్తున్న కాంట్రాక్టర్
మైనింగ్ అనుమతుల పత్రాలు అందలేదంటున్న వైద్యాధికారి
పత్తికొండ, ఆగస్టు 26. (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో బుధవారం పట్టపగలే ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టారు. అదేమని ప్రశ్నిస్తే మైనింగ్ శాఖ అనుమతులతోనే తవ్వకాలు చేస్తున్నట్లు సమాధానమిచ్చారు. ఇక్కడి ప్ర భుత్వాస్పత్రికి దశాబ్దాలక్రితం ప్రభుత్వం 12ఎకరాల భూమిని కేటాయించింది. అం దులో సమీకృత హాస్టల్ నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎకరా స్థలం కేటాయించడంతో ఆస్పత్రి స్థలం 11ఎకరాలు మిగిలింది.
గుట్ట ప్రాంతంలోనే..
ఆరంభంలో గుట్టప్రాంతంలోనే ఆస్పత్రి భవనాన్ని ఏర్పాటుచేశారు. కాలక్రమంలో 30పడకల ఆస్పత్రి మార్పుకావడంతో వాలుప్రాంతంలో ఆస్పత్రి భవనాన్ని నిర్మిం చారు. కాన్పుల విభాగం ఏర్పాటుకాగా అప్పటి డిప్యూటీ సిఎం కేఈ క్రిష్ణమూర్తి హ యాంలో నూతన ఓపీ భవనం ఈభవనాలకు ఆనుసంధానంగా నిర్మించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రభుత్వం నుంచి రూ4.9కోట్లతో మరో 20 అదనపు పడకల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరుచేయించడంతో ప్రస్తుతం ఉన్న భవనసముదాయాన్ని ఆనుకునే నూతన భవనపనులు ప్రారంభం అయ్యాయి.
మట్టిని నూతనంగా నిర్మిస్తున్న..
20పడకల భవననిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ యంత్రాల సాయంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లద్వారా తవ్విన మట్టిని నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులకు తరలించుకున్నాడు. విష యం తెలుసుకున్న మీడియా ప్రతినిధలు అక్కడికి చేరుకుని మట్టితవ్వకాలపై ప్రశ్నించారు. మైనింగ్‌శాఖ అనుమతులతోనే మట్టి తవ్వకాలు చేపడుతున్నామని తా మేమీ తప్పుచేయడంలేదని సమాధానమిచ్చారు.ఆస్పత్రి ప్రాంగణంలో మట్టి తవ్వకా లకు సంబంధించి మైనింగ్ శాఖ ఇచ్చిన ఎలాంటి ఉత్తర్వులు అధికారికంగా తమకు అందలేదని పత్తికొండ ప్రభుత్వవైద్యాదికారి కల్పన మీడియాకు వివరణ ఇచ్చారు. అధికారిక ఉత్తర్వులు అందేవరకు మట్టి తవ్వకాలు నిలిపేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు.
నిర్మాణాలపై పలు అనుమానాలు
సదరు కాంట్రాక్టర్ ఆస్పత్రి నూతన భవన నిర్మాణంలో నాణ్యతను పాటించడం లేదన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే పిల్లర్ల నడుమ రెండడుగులు తీయాల్సిన పునాదులు తీయకుండానే నిర్మాణాలు చేపట్టి నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినట్లు సదరు కాంట్రాక్టర్‌పై ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టి మైనింగ్ అధికారుల పేరును వాడుకోవడం చర్చాంశనీయంగా మారింది.