Share News

స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌లో ఐఎంఆర్‌ పెట్టుబడి రూ.300 కోట్లు

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:53 AM

విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియా లిమిటెడ్‌లో స్విట్జర్లాండ్‌ నుంచి పనిచేసే ఐఎంఆర్‌ గ్రూపు...

స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌లో ఐఎంఆర్‌ పెట్టుబడి రూ.300 కోట్లు

విశాఖపట్నం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియా లిమిటెడ్‌లో స్విట్జర్లాండ్‌ నుంచి పనిచేసే ఐఎంఆర్‌ గ్రూపు రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఐఎంఆర్‌ గ్రూపు అంతర్జాతీయ స్థాయిలో మెటల్స్‌, మైనింగ్‌ వ్యవహారాలు నడుపుతోంది. ఈ రెండు సంస్థలు చాలాకాలంగా కలిసి వ్యాపారం చేస్తున్నాయి. ప్రస్తుతం ‘స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌’ వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 0.5 మిలియన్‌ టన్నులు కాగా దీనిని 1.5 నుంచి 2 మిలియన్‌ టన్నులకు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విస్తరణలో భాగంగా నిధుల సమీకరణకు రూ.350 కోట్ల విలువైన ప్రిఫరెన్సియల్‌ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. అందులో రూ.300 కోట్ల విలువైన షేర్లను తీసుకోవడానికి ఐఎంఆర్‌ గ్రూపు ముందుకు వచ్చింది.

Updated Date - Mar 06 , 2026 | 06:09 AM