‘మిల్టన’లో ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:39 AM
పట్టణంలోని మిల్టన్ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం సైన్స ఫెయిర్ నిర్వహించారు.
ఆదోని, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మిల్టన్ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం సైన్స ఫెయిర్ నిర్వహించారు. ఈ ప్రదర్శనను పాఠశాల కరస్పాండెంట్ రమే్‌షబాబు, విశ్రాంత హెచ్‌ఎం డి.మోహన్‌రావు, వెంకటేష్, నాగరాజు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతకు పదును పెడుతూ నిర్వహించిన సైన్స్ ఫెయిర్ (విజ్ఞాన ప్రదర్శన) సందర్శకులను మంత్రముగ్దులను చేసింది. తమ మేధస్సుతో విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు భవిష్యత్ శాస్త్రవేత్తలకు వీరు ఏమాత్రం తీసిపోరని నిరూపించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు ఎంతో దోహద పడతాయన్నారు. విద్యార్థులు కేవలం థియరీలకే పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను చూపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆసక్తిగా తిలకించారు.