రేపటినుంచి పెరగనున్న వర్షాలు
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:28 AM
ఉత్తర, మధ్య బంగాళాఖాతం, లక్షద్వీప్ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు..
827, 28న అక్కడక్కడా భారీవర్షాలు: ఐఎండీ
విశాఖపట్నం, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ఉత్తర, మధ్య బంగాళాఖాతం, లక్షద్వీప్ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశాల్లో అన్ని ప్రాంతాలకు, మహారాష్ట్రలో ముంబై వరకు విస్తరించాయి. మంగళవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు కురవగా, మరికొన్నిచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. కావలిలో 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25 నుంచి రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉన్నందున వర్షాలు పెరుగుతాయని, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 26, 27 తేదీల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.