ఎల్‌నినో వచ్చేసింది
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:37 AM
భూమధ్యరేఖకు ఆనుకుని పసిఫిక్ మహాసముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం ప్రకటించింది.
విశాఖపట్నం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): భూమధ్యరేఖకు ఆనుకుని పసిఫిక్ మహాసముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికి అనుగుణంగా భూమధ్యరేఖ పరిసరాల్లోని తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో వాతావరణ మార్పులు సంభవించాయి. ప్రస్తుత నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. జూలై నుంచి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోకి వేడి వాతావరణం విస్తరించే క్రమంలో ఎల్‌నినో బలపడుతుంది. ఇదిలా ఉండగా, దేశంలోని 197 జిల్లాలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఏపీతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లోని పలు జిల్లాల్లో వర్షాభావం నెలకొంటుందని తెలిపింది. ఈ కారణంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పప్పుధాన్యాలు, సోయాబీన్ ఉత్పత్తిలో భారీ తగ్గుదల ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసిం ది. కాగా, శుక్రవారం రుతుపవనాలు పలు రాష్ట్రాలకు విస్తరించాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణాది లో అన్ని ప్రాంతాలు, మధ్య, తూర్పు భారతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.