కృష్ణపట్నం పోర్టు సమీపంలో చెన్నై బోటు స్వాధీనం
ABN , Publish Date - Apr 09 , 2026 | 05:32 AM
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు సమీపంలో అక్రమంగా వేటసాగిస్తున్న చెన్నై బోటును బుధవారం అధికారులు పట్టుకున్నారు.
ముత్తుకూరు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు సమీపంలో అక్రమంగా వేటసాగిస్తున్న చెన్నై బోటును బుధవారం అధికారులు పట్టుకున్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో మెరైన్ కోస్ట్ గార్డ్, పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా కృష్ణపట్నం పోర్టుకు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో చేపల వేట సాగిస్తున్న చెన్నై మరబోటును, సిబ్బందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చేపలను స్వాధీనం చేసుకున్నారు. బోటును, సిబ్బందిని, రూ.5 లక్షల విలువ చేసే చేపలను జువ్వలదిన్నె పరిధిలో పోలీసులకు అప్పగించామని మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా తెలిపారు.