ఐఎఫ్ఎస్ అధికారి కుమార్తెకు కారుణ్యం
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:48 AM
ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ కుమార్ సుమన్ కుమార్తె మిష్కా సుమన్‌ను కారుణ్య నియామకం కింద గ్రూప్-1 సర్వీసులోకి తీసుకుంటూ..
అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ కుమార్ సుమన్ కుమార్తె మిష్కా సుమన్‌ను కారుణ్య నియామకం కింద గ్రూప్-1 సర్వీసులోకి తీసుకుంటూ మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 1993 కేడర్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రమేష్ కుమార్ సుమన్ సర్వీసులో ఉండగానే మరణించడంతో ఆయన కుమార్తెకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 ఉద్యోగం ఇస్తూ, ఆమెను సీడీఎంఏ కార్యాలయంలో గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ పోస్టులో నియమించారు.