పిచ్చి మొక్కలు తొలగించాలన్నా.. ఎమ్మెల్యే పర్యటించాల్సిందే..!
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:04 AM
ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, ముళ్లకంప తొలగించా లని కోరినా ఎవరూ పట్టించుకో లేదు.
బండిఆత్మకూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, ముళ్లకంప తొలగించా లని కోరినా ఎవరూ పట్టించుకో లేదు. కానీ, ఎమ్మెల్యే బుడ్డా రాజ శేఖర్‌రెడ్డి వస్తున్నారని తెలిసిన వెంటనే పనులు జరిగిపోతాయనే దానికి ఇది నిదర్శనం. మండలంలోని ఏ.కోడూరు గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో శుక్రవారం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టారు. శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ హాజరయ్యారు. వీరి రాకతో ఇది వరకు కంపచెట్లు, పిచ్చిగడ్డితో అల్లుకుపోయి చిట్టడవిని తలపిస్తున్న పాఠశాల ప్రాంగాణాన్ని అప్పటికప్పుడు ఉపాధి హామీ పథకం కూలీలతో కింద పరిశుభ్రం చేయించారు. దీంతో ఎమ్మెల్యే లు, ఉన్నతాధికారులు వస్తానే గ్రామ శుభ్రత, అభివృద్ధిపై చర్యలు తీసుకుంటారేమోనని ప్రజలు చర్చించుకున్నారు. ఇంతకాలానికి కంపచెట్లు, పిచ్చిగడ్డి తొలగించడంతో హర్షం వ్యక్తం చేశారు.