Share News

క్రాపలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:21 AM

బాపట్ల జిల్లా కొల్లూరు మండలం క్రాప గ్రామంలో నూతనంగా నిర్మితమైన ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం కనులపండువగా జరిగింది.

క్రాపలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

  • శ్రీరామభట్టాచార్యులు ఆధ్వర్యంలో క్రతువు

  • పాల్గొన్న ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్లు కోగంటి భానుప్రకాశ్‌, అనూష దంపతులు

బాపట్ల, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా కొల్లూరు మండలం క్రాప గ్రామంలో నూతనంగా నిర్మితమైన ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం కనులపండువగా జరిగింది. రొంపిచర్ల శ్రీరామభట్టాచార్యులు ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహించారు. సీతారామ, లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 10.08 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ మహోత్సవంలో వ్యాపారవేత్త కోగంటి ఈశ్వర్‌చంద్‌, కృష్ణకుమారి దంపతులు, ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్లు కోగంటి భానుప్రకాశ్‌, అనూష దంపతులు, తోటకూర శ్రీనివాస్‌, సంధ్య, జొన్నలగడ్డ మోహన బసవపున్నయ్య, నిర్మల దంపతులు పాల్గొన్నారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి, కనకదుర్గ ఆలయాల్లో యంత్రస్థాపన, రామాలయం, కనకదుర్గ ఆలయాలపైన కలశ స్థాపన చేశారు.

Updated Date - Feb 27 , 2026 | 03:24 AM