గిరిపుత్రులను గుర్తించడం చారిత్రాత్మకం
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:01 AM
శ్రీశైల క్షేత్ర పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తూ తరతరాలుగా ఆదిదంపతుల సన్నిధిలో జీవనం సాగిస్తున్న గిరిపుత్రులను గుర్తించి మల్లన్న స్పర్శ దర్శనం కల్పించడం చారిత్రాత్మకమని సినీ నటుడు సుమన అన్నారు.
సినీ నటుడు సుమన
శ్రీశైలం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్ర పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తూ తరతరాలుగా ఆదిదంపతుల సన్నిధిలో జీవనం సాగిస్తున్న గిరిపుత్రులను గుర్తించి మల్లన్న స్పర్శ దర్శనం కల్పించడం చారిత్రాత్మకమని సినీ నటుడు సుమన అన్నారు. తిరుమల క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి వారి దర్శనాంతరం అతిథిగృహంలో శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నా యుడును సుమన శుక్రవారం అభినందించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ చెంచుల ఆత్మగౌరవాన్ని గుర్తిండంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి, అధికారులు సిబ్బంది సహకారం హర్షణీయమన్నారు.