Share News

టీటీడీ అకౌంటింగ్‌ ఆధునికీకరణకు అధ్యయనం

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:35 AM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అకౌంటింగ్‌ వ్యవస్థను ఆధునికీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి.

టీటీడీ అకౌంటింగ్‌ ఆధునికీకరణకు అధ్యయనం

  • 100 రోజుల్లోపు మాన్యువల్‌ రూపొందించనున్న ఐసీఏఐ

తిరుమల, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అకౌంటింగ్‌ వ్యవస్థను ఆధునికీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ వ్యవస్థను మెరుగుపరిచేందుకు భారత చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ సంస్థ (ఐసీఏఐ) సమగ్ర అధ్యయనం చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం ఐసీఏఐను టీటీడీ సంప్రదించింది. ఈ నేపథ్యంలో తాజా అవసరాలకు అనుగుణంగా ఒక అకౌంటింగ్‌ మాన్యువల్‌ను ఐసీఏఐ రూపొందించి వంద రోజుల్లోపు అందజేయనుంది. ఇప్పటికే ఐసీఏఐకి చెందిన అకౌంటింగ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రాథమిక అధ్యయనం ప్రారంభించింది. ప్రస్తుతం టీటీడీలో ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) ఆధారిత సమగ్ర అకౌంటింగ్‌ వ్యవస్థ అమలులో ఉంది. ఈ వ్యవస్థను ఆధునికీకరించే లక్ష్యంతో తాజా అధ్యయనం మొదలైంది.

Updated Date - Jun 27 , 2026 | 05:36 AM