Share News

విశాఖకు మళ్లీ ఐబీఎం రాక

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:31 AM

ప్రసిద్ధ ఐటీ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.

విశాఖకు మళ్లీ ఐబీఎం రాక

  • ఎస్‌టీపీఐలో నమోదు.. మూడేళ్లలో 322 కోట్ల ఎగుమతులు

విశాఖపట్నం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ ఐటీ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇక్కడి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ)లో ‘ఐబీఎం ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో సోమవారం రిజిస్టర్‌ చేసుకుంది. రాబోయే మూడేళ్లలో రూ. 322 కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని ప్రకటించింది. దీని ద్వారా 502 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. ఈ సంస్థ ఇంతకుముందు రుషికొండ ఐటీ పార్కు హిల్‌ 2పై కార్యకలాపాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా తరువాత పరిస్థితులు అనుకూలించక కొనుగోలు చేసిన భూమి, అందులో భవనం ఇన్‌ఫినిటీ కంపెనీకి విక్రయించేసింది. ఇప్పుడు విశాఖకు భారీ ఐటీ కంపెనీలు వస్తున్న నేపథ్యంలో ఐబీఎం కూడా వెనక్కి వస్తోంది.

Updated Date - Mar 03 , 2026 | 03:32 AM