యువ ఐఏఎస్ సంస్కారం
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:17 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీలోని మారుమూల బూరిగ గ్రామాన్ని గురువారం జాయింట్ కలెక్టర్ శ్రీపూజ సందర్శించిన సందర్భంగా...
మోకాళ్లపై కూర్చుని గిరిజనులకు నమస్కారం!
అనంతగిరి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీలోని మారుమూల బూరిగ గ్రామాన్ని గురువారం జాయింట్ కలెక్టర్ శ్రీపూజ సందర్శించిన సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. గిరిజనులు మోకాళ్లపై కూర్చుని జాయింట్ కలెక్టర్‌కు సమస్కరిస్తూ స్వాగతం పలకగా...ఆమె కూడా మోకాళ్లపై కూర్చుని వారికి ప్రతి నమస్కారం చేశారు. దీంతో యువ ఐఏఎస్ తీరుపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్న శ్రీపూజ... అన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటివరకూ ఏ అధికారి కూడా తమ సమస్యలను ఇంత ఓపికగా వినలేదని ఈ సందర్భంగా గిరిజనులు పేర్కొన్నారు.