నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:12 AM
అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
క్రిష్ణగిరి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం కటారుకొండ, ఆలంకొండ, బోయ బొంతిరాళ్ళ, చుంచు ఎర్రగుడి, కంబాలపాడు, పోతుగల్లు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజవర్గంలో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు తదితర వాటిని నిర్మిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోంద న్నారు. కార్యక్రమంలో క్రిష్ణగిరి సింగిల్ విండో చైర్మన కేఈ శేషాద్రి, పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన నభి సాహేబ్, మర్రి శ్రీరాములు, ఎల్వీ ప్రసాద్, దామోదర్ నాయుడు, గురుస్వామి, మహమ్మద్ రఫీ, సోమలింగన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం
తుగ్గలి: ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం బొందిమడుగుల, బొంతిరాళ్ల గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.32 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం జేబులు నింపుకోవడానికే పని చేశారే గానీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ సలహా మండలి సభ్యులు వెంకటపతి, ప్రతాప్ యాదవ్, మోహన, రామారావు, మాబు, తదితరులు పాల్గొన్నారు.