Share News

అప్పు తీర్చలేను అమ్మోరు తల్లీ

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:52 AM

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని చౌడేశ్వరి ఆలయానికి చేనేత కార్మికసంఘం మాజీ నాయకుడు మాయకుంట్ల మోహన్‌ ఐపీ నోటీసులు ఇచ్చారు.

అప్పు తీర్చలేను అమ్మోరు తల్లీ
ammorurepresentation

ఆలయానికీ చేనేత నాయకుడి ఐపీ నోటీసు

యాడికి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని చౌడేశ్వరి ఆలయానికి చేనేత కార్మికసంఘం మాజీ నాయకుడు మాయకుంట్ల మోహన్‌ ఐపీ నోటీసులు ఇచ్చారు. మొత్తం 56 మంది రుణదాతలకు రూ.1.65 కోట్లకు ఆయన ఐపీ నోటీసులు పంపించారు. అందులో చౌడేశ్వరి ఆలయానికి ఇవ్వాల్సిన రూ.3 లక్షలు ఉంది. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌడేశ్వరి ఆలయం అభివృద్ధి కమిటీ పేరుతో చిట్టీలు వేశామని, అందులో మాయకుంట్ల మోహన్‌ కూడా ఉన్నారని వారు ఆదివారం తెలిపారు. గతంలో కూడా చిట్టీలు వేశాడని, నమ్మకంగా ఉండి రూ.3 లక్షల చిట్టీ ఎత్తుకున్నాడని తెలిపారు. కానీ ఇలా ఐపీ నోటీసులు పంపిస్తాడని అనుకోలేదని మండిపడుతున్నారు.

Updated Date - Oct 05 , 2026 | 05:53 AM