Share News

హైదరాబాద్‌లో జాబ్‌మేళా.. సుభాష్‌ ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:51 AM

హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో జాబ్‌మేళా.. సుభాష్‌ ప్రజాదర్బార్‌

అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ హామీ ఇచ్చారు. ఏపీ ప్రజల కోసం హైదరాబాద్‌లోని బిక్షపతి యాదవ్‌ కల్యాణ మండపంలో ఆదివారం జాబ్‌మేళాతోపాటు ప్రత్యేక ప్రజాదర్బార్‌ను మంత్రి నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను ఓర్పుగా విన్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ఉద్యోగార్థులకు వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్‌ మేళా నిర్వహించినట్లు తెలిపారు. యువతకు ఉపాధి కల్పన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జాబ్‌మేళా, ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభించిందన్నారు. ఎక్కడ ఉన్నా ఏపీ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.

Updated Date - Jul 06 , 2026 | 05:52 AM