Share News

ఒంటిమిట్ట రామయ్యకు బంగారు కిరీటాలు వితరణ

ABN , Publish Date - Mar 05 , 2026 | 03:49 AM

కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడికి హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త పి.ప్రతా్‌పరెడ్డి, వెంకటలక్ష్మీరెడ్డి దంపతులు మూడు...

ఒంటిమిట్ట రామయ్యకు బంగారు కిరీటాలు వితరణ

ఒంటిమిట్ట, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడికి హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త పి.ప్రతా్‌పరెడ్డి, వెంకటలక్ష్మీరెడ్డి దంపతులు మూడు బంగారు కిరీటాలను అందజేశారు. వీటి విలువ సుమారు రూ.2.85 కోట్లు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కిరీటాలను డిప్యూటీ ఈవో శివప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌, అర్చకులు శ్రావణ్‌కుమార్‌, మనోజ్‌కుమార్‌ సమక్షంలో దాతలు బుధవారం కోదండ రామాలయంలో అందజేశారు.

Updated Date - Mar 05 , 2026 | 03:49 AM