దుర్గమ్మకు బంగారు కిరీటం
ABN , Publish Date - Sep 28 , 2026 | 04:12 AM
బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు కిరీటం కానుకగా రానుంది.
హైదరాబాద్ వాసి కానుక
విజయవాడ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు కిరీటం కానుకగా రానుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి సుమారు 506. 020 గ్రాములతో తయారుచేయించిన ఈ బంగారు కిరీటంలో 1.73 క్యారెట్ల డైమండ్లు కూడా పొదిగారు. సుమారు రూ.76.60 లక్షలతో దీనిని తయారుచేశారు. త్వరలో ఆలయ అధికారులకు కిరీటాన్ని అందజేయనున్నారు.