మరో 3 నెలలు హెచ్‌పీవీ వ్యాక్సిన్
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:09 AM
గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్)క్యాన్సర్ నిరోధానికి అందించే హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైర్‌స)ను మరో మూడు నెలల పాటు..
2.71 లక్షల మందికి వ్యాక్సినేషన్
గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్)క్యాన్సర్ నిరోధానికి అందించే హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైర్‌స)ను మరో మూడు నెలల పాటు అందించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించిందని ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 2,71,071 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలు వేసినట్లు వెల్లడించారు.
లింగ నిర్ధారణపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్
రాష్ట్రంలో ఆడ శిశువుల సంరక్షణ, మహిళా భ్రూణ హత్యల నివారణ కోసం అమలులో ఉన్న ప్రీ-కన్సప్షన్ అండ్ ప్రీ-నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1800233 2447ను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.