Share News

పేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:25 PM

రాష్ట్రంలోని పేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

   పేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట దీక్ష ప్రారంభం

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట సోమవారం సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యవర్గ సభ్యుడు బీసన్న అధ్యక్షతన చేపట్టిన దీక్షలను రామకృష్ణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు డబుల్‌ ఇంజన సర్కారు అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం.. ప్రజలు అడగకుండానే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలాఓ్ల మూడు సెంట్లు ఇస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా హమీని నెరవేర్చడం లేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతంలో కరువుతో కొట్టుమిట్టాడుతుంటే వలస జీవులు పట్ణణ ప్రాంతాలకు వెళ్లి జీవనోపాది చేసుకోవాలంటే అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. సీపీఐ నాలుగేళ్ల క్రితం ప్రభుత్వ స్థలాలలో పేదోడి సొంతింటి కల నెరవేర్చడానికి వెయ్యి మందికి స్థలాలు పంపిణీ చేసిందని, ఆ స్థలాల్లో పూర్తిగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని, ఆ స్థలాలకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్‌ వ్యక్తులకు, సంస్థలకు తక్కువ రేట్లకే ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వం పేదోడికి రెండు, మూడు సెంట్లు స్థలం ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు కె.రామాంజనేయులు, జగదీష్‌, నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శులు డి.శ్రీనివాసరావు, సి.మహేష్‌, నాగరాజు, భద్రకుమార్‌, సి.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:25 PM