Share News

ఉద్యాన సాగుకూ పీపీపీ.. డీపీఆర్‌కు ఆదేశం

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:11 AM

రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను ఉద్యానవన క్లస్టర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానం అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.

ఉద్యాన సాగుకూ పీపీపీ.. డీపీఆర్‌కు ఆదేశం

  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు: సీఎం

రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను ఉద్యానవన క్లస్టర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానం అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. వివిధ శాఖలతో సీఎం సమీక్షలో ఉద్యాన శాఖ ఈ మేరకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఉద్యాన పంటల సాగుకు పీపీపీ విధానంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిశ్చయించింది. ఇందులో ప్రభుత్వం రూ.32 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల దాకా పెడుతుంది. మిగతా రూ.65-68 వేల కోట్లు ప్రైవేటు రంగం నుంచి సమకూర్చుకోవాలి. కాగా, రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను గ్లోబల్‌ హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చేందుకు కేంద్ర పథకాలు పూర్వోదయ, మిథ్‌, ఆర్‌వీఐ పథకాల ద్వారా రూ.8,650 కోట్లు సాధించాలని ఆర్థికశాఖ భావిస్తోంది. పీఎం కిసాన్‌ సంపద యోజన, ఆగ్రోప్రాసెసింగ్‌ క్లస్టర్‌కింద మరో రూ.15,000 కోట్లను కేంద్రం నుంచి సమకూర్చుకోవాలని భావిస్తోంది.హైటెక్‌ ప్రాసెసింగ్‌ కింద రూ10, 000 కోట్లు, లాజిస్టిక్స్‌ కోసం ఇంకో రూ.7,000 కోట్లను రాబట్టుకోవచ్చని అంచనా వేస్తోంది.

Updated Date - Jan 28 , 2026 | 04:13 AM