Share News

ఆశలు నేలపై... చూపు ఆకాశం వైపు

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:46 PM

ఆరుద్ర కార్తెలో చినుకు జాడ లేదు. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి.

 ఆశలు నేలపై... చూపు ఆకాశం వైపు
దేవనకొండలో సాగైన పత్తి పంట

దోబూచులాడుతున్న మేఘాలు

ఈదురుగాలులకు ఎండుతున్న పంటలు

ఆందోళనలో అన్నదాతలు

దేవనకొండ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఆరుద్ర కార్తెలో చినుకు జాడ లేదు. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. ఊరించి న మేఘాలు అరగంటలో ఉసురుమనిపిస్తున్నాయి. 20 రోజులుగా ప్ర తి రోజు ఇదే తంతు. దీంతో వర్షం కురవక ఈదురుగాలులకు, ఎండవేడిమికి పంటలు ఎండిపోతున్నాయి. మండలంలో ప్రధాన పంట పత్తి, వేరుశనగ, ఆముదం, కందులు దాదాపు 70 వేల ఎకరాలకు పైగా సాగు చేశారు. గత ఇరవై రోజులుగా వర్షం జాడ లేకపోవడంతో పత్తి పంట లో ఎదుగుదల లేక మొక్క దశలోనే ఆకులు రాలిపోతున్నాయి. సరైన వర్షం లేక మొక్క గిడసబారీ ఎదుగుల నిలిచిపోవడంతో రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ, ఆముదం పంటలు వాడుము ఖం పట్టాయి. ఆకాశంలో కారుమబ్బులు నిత్యం కమ్ముకున్నా వర్షం మాత్రం కురువడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో చినుకు జాడ లేకుండా పోతుందని పలువురు రైతులు వాపోతున్నారు.

తెల్లదోమ పడుతుంది

గత ఇరవై రోజులుగా వర్షం జాడ లేదు. పత్తి పంటలో ఎర్ర పేను, తెల్ల, పచ్చ దోమలు వ్యాప్తి పెరిగిపోయింది. దాంతో మొక్కల్లో ఎదుగుదల లేదు. ఇలాగే ఉంటే మరికొన్ని రోజుల్లో పత్తి మొక్కలు జీడ బారీన పడుతాయి. ఈ ఏడాది సాగు కష్టంగా మారింది.

- ఖలీల్‌, రైతు, దేవనకొండ

Updated Date - Jul 03 , 2026 | 11:46 PM