Share News

‘హనీ’ మాటలు... మనీ సెటిల్‌మెంట్లు!

ABN , Publish Date - Apr 20 , 2026 | 04:20 AM

‘హాయ్‌..’ అంటూ స్వీట్‌ వాయి్‌సతో కాల్‌ చేస్తారు. తర్వాత ఇంటికి రమ్మంటారు. రెచ్చగొట్టి ఒంటి మీద దుస్తులన్నీ విప్పిస్తారు. తర్వాత కాసేపటికే ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు.

‘హనీ’ మాటలు... మనీ సెటిల్‌మెంట్లు!

  • డబ్బున్నోళ్లే టార్గెట్‌.. నగ్న ఫొటోలు, వీడియోలతో బెదిరింపులు

  • అనంతలో హనీట్రాప్‌ ముఠా ఆగడాలు

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ‘హాయ్‌..’ అంటూ స్వీట్‌ వాయి్‌సతో కాల్‌ చేస్తారు. తర్వాత ఇంటికి రమ్మంటారు. రెచ్చగొట్టి ఒంటి మీద దుస్తులన్నీ విప్పిస్తారు. తర్వాత కాసేపటికే ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు. నగ్న స్థితిలో ఉన్నవారి ఫొటోలు, వీడియోలు తీసి డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తారు. అనంతపురంజిల్లాలో వందలాది మంది ఈ ముఠా ఉచ్చులో చిక్కినట్లు సమాచారం. అనంతపురం నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బున్న వ్యక్తులు, వ్యాపారులు, రియల్టర్లు, ఉద్యోగులను ఈ ముఠా సభ్యులు టార్గెట్‌ చేస్తారు. ముందు వారి సెల్‌నంబర్‌ సంపాదిస్తారు. ఆడపిల్లలతో కాల్‌ చేయించి వారం, 10 రోజులు తరచూ మాట్లాడిస్తారు. తర్వాత పర్సనల్‌ ప్రాబ్లమ్‌ అంటూ ప్రత్యేకంగా మాట్లాడాలంటూ ఇంటికి రావాలని బతిమాలుతారు. ఇంటికొచ్చాక అమ్మాయి ముగ్గులోకి దించుతుంది. ఒంటిపైనున్న దుస్తులు విప్పాక హనీట్రాప్‌ ముఠా సభ్యులు ఎంట్రీ ఇస్తారు. వచ్చీ రాగానే... ఆవేశంతో ఊగిపోయినట్లు నటిస్తారు. నగ్నంగా ఉన్న వ్యక్తి మీదపడి కొడతారు. ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. దీంతో బాధితుడు భయపడి కాళ్ల బేరానికి వస్తాడు. ఇక అప్పటినుంచీ ఈ గ్యాంగ్‌ వసూళ్ల పర్వం మొదలవుతుంది. బాధితుల నుంచి రూ.25 లక్షల వరకూ లాగుతారు. ఆ తర్వాత కూడా డబ్బుల కోసం వేధిస్తారు. ఇంటి వద్దకు వచ్చి పరువు తీస్తామనడంతో బాధితులు బెదిరిపోయి.. బంగారం, ఆస్తులు అమ్ముకొని ఈ ముఠాకు డబ్బులు సమర్పించుకుంటున్నారు. హనీట్రాప్‌ బాధితుల జాబితాలో ఉద్యోగులు, అర్చకులు, వ్యాపారులతో పాటు కొందరు బడాబాబులు కూడా ఉన్నారు. తాజాగా బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఈ ముఠా ట్రాప్‌లో పడ్డాడు. అతడినుంచి ముందుగా రూ.4.5 లక్షలు గుంజారు. మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు జిల్లా ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశాడు.

Updated Date - Apr 20 , 2026 | 04:20 AM