Share News

నిస్వార్థమైన ప్రేమ, సేవ అమ్మతోనే: హోం మంత్రి అనిత

ABN , Publish Date - May 11 , 2026 | 04:26 AM

స్వార్థమైన ప్రేమ, సేవ ఒక్క అమ్మతోనే సాధ్యమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం...

నిస్వార్థమైన ప్రేమ, సేవ అమ్మతోనే: హోం మంత్రి అనిత

కంకిపాడు, మే 10 (ఆంధ్రజ్యోతి): నిస్వార్థమైన ప్రేమ, సేవ ఒక్క అమ్మతోనే సాధ్యమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోసాల గ్రామ పరిధిలోని వాసవ్య మహిళ మండలి వృద్ధాశ్రమంలో ఆదివారం నిర్వహించిన మదర్స్‌ డే వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి అనిత పాల్గొన్నారు. వృద్ధ మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. వారితో కలిసి కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 04:27 AM