Share News

Anakapalli District: సంబరాల్లో హోం మంత్రి

ABN , Publish Date - Jan 15 , 2026 | 04:10 AM

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లివానిపాలెంలోని హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.

Anakapalli District: సంబరాల్లో హోం మంత్రి

నక్కపల్లి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లివానిపాలెంలోని హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉదయం హోం మంత్రి అనిత భోగిమంటను వెలిగించారు. తదుపరి నియోజకవర్గ పరిధిలో మహిళల కోసం రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ సంబరాల్లో కేరళ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హోం మంత్రి అనిత కూడా డ్రమ్స్‌ వాయిస్తూ సందడి చేశారు. అనంతరం ఎద్దుల బండిని నడిపారు.

Updated Date - Jan 15 , 2026 | 04:11 AM