Share News

వైసీపీది క్రెడిట్‌ చోరీ ఆరాటం

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:26 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ మంచి పనిచేసినా వైసీపీ క్రెడిట్‌ చోరీకి ప్రయత్నం చేస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు.

వైసీపీది క్రెడిట్‌ చోరీ ఆరాటం

  • మా హయాంలోనే 70శాతం పూర్తయిన మూలపేట పోర్టు: మంత్రి అనిత

విజయనగరం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ మంచి పనిచేసినా వైసీపీ క్రెడిట్‌ చోరీకి ప్రయత్నం చేస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. సోమవారం ఆమె విజయనగరం పర్యటనలో విలేకరులతో మాట్లాడారు. ‘ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం కూటమి ప్రభుత్వం హయాంలో 70 శాతం పూర్తయింది. రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు వచ్చినా అప్పట్లో వైసీపీ పాలకులకు వాటాలు, కమీషన్లే. ఇందుకు నిదర్శనం భోగాపురం ఎయిర్‌ పోర్టు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతున్నాయి. అమరావతిపై కౌన్సిల్‌లో తీర్మానం ఎందుకు చెయ్యలేదని ప్రశ్నిస్తున్నారు. అసలు అమరావతి రాజధానికి వైసీపీ అనుకూలమా? వ్యతిరేకమా? స్పష్టంగా చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు..

Updated Date - Mar 31 , 2026 | 06:27 AM