హిందూజా పవర్‌కు 6.78 కోట్ల జరిమానా
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:07 AM
పర్యావరణానికి హాని కలిగించేలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ విశాఖ పెదగంట్యాడలోని హిందూజా పవర్ ప్లాంటుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి...
విశాఖపట్నం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పర్యావరణానికి హాని కలిగించేలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ విశాఖ పెదగంట్యాడలోని హిందూజా పవర్ ప్లాంటుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రూ.6.78 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు కంపెనీకి ఇటీవల డిమాండ్ నోటీసు జారీ చేసింది. విద్యుదుత్పత్తి వల్ల వచ్చే బూడిద నిర్వహణలో పర్యావరణ ప్రమాణాలను కంపెనీ ఉల్లంఘించింది. దీనిపై రెండు, మూడు పర్యాయాలు పీసీబీ నోటీసులిచ్చినా కంపెనీ తీరు మారకపోవడంతో జరిమానా విధించినట్లు కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్ తెలిపారు.