Share News

వైద్య సేవలకు అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:27 PM

కూటమి ప్రభుత్వ వైద్య సేవలకు అధిక ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.

వైద్య సేవలకు అధిక ప్రాధాన్యం

ఎమ్మెల్యే పార్థసారథి

తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభం

ఆదోని, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ వైద్య సేవలకు అధిక ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. మంగళవారం స్థానిక ఎంసీహెచ్‌ ఆసుపత్రి ప్రాంగణంలో 102 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అత్యాధునిక వాహనాలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని ఎంసీహెచ్‌ ఆసుపత్రికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బాలింతలు, పుట్టబోయే బిడ్డలు సురక్షితంగా ఇళ్లకు చేరేందుకు ఈ ఆరు వాహనాలు ఎంతో కొండంత అండగా నిలవనున్నాయని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు ప్రయాణభారం తగ్గించే ఈ ఉచిత డ్రాప్‌ బ్యాక్‌ సేవలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ వాహనాల్లో ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం అత్యాధునిక వసతులు కల్పించారని చెప్పారు. వాహనంలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఏబీఎస్‌, ఈబీడీ వ్యవస్థలతో పాటు ప్రయాణ భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో ఎంసీహెచ్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, కమిషనర్‌ నయీమ్‌ అహ్మద్‌, ఆసుపత్రి డెవలప్‌మెంట్‌ కమిటీ సభ్యులు లలితమ్మ, రేణువర్మ, బీజేపీ నాయకులు ఉపేంద్రకుమార్‌, మధుసూదన్‌శర్మ, ప్రశాంత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 11:27 PM