Share News

స్టేలతో నిలిచిన కేసులు ఎన్ని?

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:48 AM

హైకోర్టు స్టే ఉత్తర్వులు కారణంగా అభియోగాల నమోదు, విచారణ ప్రక్రియ ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిలిచిపోయిన క్రిమినల్‌ కేసులు...

స్టేలతో నిలిచిన కేసులు ఎన్ని?

  • న్యాయాధికారులను కోరిన హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): హైకోర్టు స్టే ఉత్తర్వులు కారణంగా అభియోగాల నమోదు, విచారణ ప్రక్రియ ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిలిచిపోయిన క్రిమినల్‌ కేసులు, ముఖ్యంగా క్రూరమైన కేసుల వివరాలను హైకోర్టు రిజిస్ట్రీకి పంపాలని న్యాయాధికారులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ కోరారు. వివరాలు అందిన వెంటనే క్రిమినల్‌ పిటిషన్‌, క్రిమినల్‌ రివిజన్‌ కేసు త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత బెంచ్‌ ముందు లిస్ట్‌ చేసేలా రిజిస్ట్రీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిషీట్‌లు కొట్టివేయాలని కోరుతూ దాఖలైన క్రిమినల్‌ పిటిషన్లు, క్రిమినల్‌ రివిజన్‌ కేసులలో స్టే ఉత్తర్వులు కారణంగా క్రిమినల్‌ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ కమలాకర్‌రెడ్డి సర్క్యులర్‌ జారీ చేశారు.

Updated Date - Apr 24 , 2026 | 05:48 AM