High Court: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై కౌంటర్ వేయండి
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:03 AM
అనధికార, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు చేసిన చట్ట సవరణను, జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన...
మూడు శాఖలకు హైకోర్టు నోటీసులు
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): అనధికార, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు చేసిన చట్ట సవరణను, జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్) పై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పురపాలక, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు, పురపాలక శాఖ కమిషనర్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రకాశం జిల్లా, చంద్రారెడ్డిపల్లెకు చెం దిన చిన్నబోయిన హరికృష్ణ ఈ పిల్ వేశారు.