ఇంక్రిమెంట్, ప్రమోషన్ చానల్ మంజూరు చేయండి
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:16 AM
ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్ చానల్ మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని...
హైకోర్టును ఆశ్రయించిన ‘సచివాలయ’ ఉద్యోగుల సంఘం
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌తో పాటు ప్రమోషన్ చానల్ మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శులు, గ్రామ-వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వలమల శ్రీనివాసరావు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది కోటా కృష్ణ దీప్తి వాదనలు వినిపించారు.