జిల్లా న్యాయవాద సంఘాల ఎన్నికల్లో..మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించండి
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:30 AM
రాష్ట్రంలోని అన్ని జిల్లా న్యాయవాద సంఘాల ఎన్నికల్లో మహిళా న్యాయవాదులకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ న్యాయవాది తోట సునీత...
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని జిల్లా న్యాయవాద సంఘాల ఎన్నికల్లో మహిళా న్యాయవాదులకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ న్యాయవాది తోట సునీత దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఏపీ బార్ కౌన్సిల్‌కు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.