Share News

జోగిపై తొందరపాటు చర్యలు వద్దు: హైకోర్టు

ABN , Publish Date - Feb 07 , 2026 | 05:27 AM

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత జోగి రమేశ్‌పై నమోదు చేసిన కేసులలో తదుపరి విచారణ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు...

జోగిపై తొందరపాటు చర్యలు వద్దు: హైకోర్టు

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత జోగి రమేశ్‌పై నమోదు చేసిన కేసులలో తదుపరి విచారణ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తిరుపతి రూరల్‌, ఇబ్రహీంపట్నం పోలీసులకు స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Feb 07 , 2026 | 05:27 AM