Share News

కౌంటర్‌ ఎందుకు వేయడం లేదు?

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:40 AM

విశాఖపట్నంలో లులూ గ్రూపునకు భూముల కేటాయింపును సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌లో కౌంటర్‌ ఎందుకు వేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పిల్‌ దాఖలై ఏడాది కావొస్తోందని గుర్తుచేసింది.

కౌంటర్‌ ఎందుకు వేయడం లేదు?

  • లులూకు భూ కేటాయింపుల పిల్‌పై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో లులూ గ్రూపునకు భూముల కేటాయింపును సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌లో కౌంటర్‌ ఎందుకు వేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పిల్‌ దాఖలై ఏడాది కావొస్తోందని గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్‌.ప్రణతి స్పందిస్తూ.. భూకేటాయింపును సవాల్‌ చేస్తూ బహుళ పిల్స్‌ దాఖలయ్యాయని, కొందరు కేటాయింపుల పాలసీని, మరికొందరు కేటాయింపు ప్రతిపాదన జీవోలను సవాల్‌ చేశారన్నారు. కౌంటర్‌ సిద్ధంగా ఉందని, ఒకటి రెండు రోజుల్లో దాఖలు చేస్తామని వివరించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం పిల్‌పై తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది. విశాఖ, విజయవాడ నగరాల్లో షాపింగ్‌ మాల్‌ ఏర్పాటుకు లులూ గ్రూపునకు తక్కువ ధరకు భూములు కేటాయిస్తున్నారంటూ విశాఖకు చెందిన పాకా సత్యనారాయణ, విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్‌ వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హైకోర్టులో పిల్స్‌ దాఖలు చేశారు. పాకా సత్యనారాయణ తరఫున న్యాయవాది అశోక్‌రామ్‌ వాదనలు వినిపించారు.

Updated Date - Feb 12 , 2026 | 01:40 AM