గడ్డి మందు నిషేధంపై హైకోర్టులో వ్యాజ్యం
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:49 AM
పారాక్వాట్ డైక్లోరైడ్ 24 శాతం ఎస్‌ఎల్ గడ్డి మందు అమ్మకాలను 60 రోజులపాటు నిషేధిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మే 22న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): పారాక్వాట్ డైక్లోరైడ్ 24 శాతం ఎస్‌ఎల్ గడ్డి మందు అమ్మకాలను 60 రోజులపాటు నిషేధిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మే 22న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వెంకట నాగిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని డీజీపీ రాసిన లేఖ ఆధారంగా... అభ్యంతరాలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వకుండా నిషేధం విధించారన్నారు. వ్యవసాయ, వైద్య ఆరోగ్యశాఖల ముఖ్యకార్యదర్శులు, వ్యవసాయశాఖ కమిషనర్, కుటుంబ సంక్షేమ డైరెక్టర్, డీజీపీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.