తణుకులో 29 టీడీఆర్ బాండ్లు చెల్లుబాటు
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:54 AM
తణుకు పట్టణంలో టీడీఆర్ బాండ్లను కొనుగోలు చేసిన 29 మంది దరఖాస్తుదారులకు కోర్టు ఆదేశాల మేరకు వాటిని వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది.
హైకోర్టు ఆదేశాలతో అవకాశమిచ్చిన మున్సిపల్ శాఖ
అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): తణుకు పట్టణంలో టీడీఆర్ బాండ్లను కొనుగోలు చేసిన 29 మంది దరఖాస్తుదారులకు కోర్టు ఆదేశాల మేరకు వాటిని వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది. తణుకులో టీడీఆర్ బాండ్ల జారీ విషయంలో జరిగిన అవకతవకలపై మున్సిపల్ శాఖ విచారణ చేసి, ఆ బాండ్లు చెల్లుబాటు కాకుండా నిలిపేసింది. అందులో బాండ్లు పొందిన 29 మంది ఇప్పటికే ఇతరులకు విక్రయించేశారు. తాము ఎప్పుడో కొనుగోలు చేశామని, ఇప్పుడు వాటిని చెల్లుబాటు కాకుండా చేస్తే నష్టపోతామని కొనుగోలు చేసినవారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ 29 బాండ్లు చెల్లుబాటు అయ్యేలా చూడాలని హైకోర్టు మున్సిపల్ శాఖను ఆదేశించింది. దీంతో మున్సిపల్ శాఖ ఆ 29 బాండ్లు చెల్లుబాటయ్యేలా ఆదేశాలిస్తూ మిగిలిన వాటిని పెండింగ్‌లో పెట్టింది.